
భువనేశ్వర్: ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆడంబరాలకు దూరంగా ఉంటారు. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఆయన సింప్లిసిటీ వార్తల్లో నిలిచింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సీఎం నవీన్ పట్నాయక్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గురువారం ఉదయం 9.10 గంటలకు ఓ సాదాసీదా ఓటరుగా కాలినడకన 53వ నంబర్ వార్డులోని ఏరోడ్రామ్ ఉన్నత పాఠశాలకు చేరుకున్న ఆయన 544వ నంబర్ పోలింగ్ బూత్‌లో బీఎంసీ మేయర్, కార్పొరేటర్‌లకు ఓటు వేశారు. నవీన్ నివాస్ నుంచి కేవలం 300 మీటర్ల దూరంలోనే ఈ పోలింగ్ కేంద్రం ఉండడంతో సీఎం సాధారణ రక్షణ దళం సహాయంతో కాలినడకన ఓటు వేసేందుకు వెళ్లడం విశేషం.
(చదవండి: 10 నిమిషాల్లో డెలివరీ ఎలా సాధ్యం?: ‘జొమోటో’కు పోలీసుశాఖ నోటీసులు)