చిత్తూరు : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునారు. మృతులు కర్ణాటకకు చెందిన కనకపుర వాసులని పోలీసులు చెప్పారు.