మద్యం మత్తులో క్యాబ్ డ్రైవర్ వీరంగం
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ క్యాబ్ డ్రైవర్ వీరంగం సృష్టించాడు. అర్థరాత్రి మద్యం అతిగా తాగి వేగంగా కారు నడుపుతూ రోడ్డు పక్కన వెళ్తున్న నలుగురిని ఢీకొట్టాడు. ఆగకుండా వెళ్లిపోతుండగా స్థానికులు అడ్డుకుని అతడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులు అప్పగించారు. ఈ ఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి గాయత్రీనగర్ కాలనీ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.