
కారు బోల్తా... నలుగురికి గాయాలు
ఆలేరు: నల్లగొండ జిల్లా ఆలేరు మండలం పెద్దవాగు వంతెనపై ఓ కారు అదుపుతప్పి కింద పడిపోయింది. సోమవారం ఉదయం ఐదుగురు వ్యక్తులు వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నలుగురికి గాయాలు కాగా వారిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికు తరలించి వైద్యం అందిస్తున్నారు.