
తిరుమలలో సుమో బోల్తా : తీవ్ర గాయాలు
తిరుమల : తిరుమలలో ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. పాపవినాశనం రోడ్డులో టాటా సుమో అదుపు తప్పి బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో కర్ణాటకలోని హుబ్లీ గ్రామానికి చెందిన వ్యక్తులకు తీవ్రగాయాలయ్యయి. గాయపడిన వారిని అశ్విని ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.