చిత్తూరు: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం బేలుపల్లి వద్ద శనివారం కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన కుటుంబం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కారులో బయలుదేరింది. బేలుపల్లి క్రాస్ రోడ్డు వద్ద కారు అదుపు తప్పి.. పక్కనే ఉన్న గోతిలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో ప్రియ (35) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, కుమారవేలు (35), లక్ష్మీకుమారి (65), శివమణి (49), విసు (35) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను తమిళనాడులోని వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. ప్రియ మృతదేహాన్ని బైరెడ్డిపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.