ఓల్వో బస్సు బోల్తా: నలుగురికి గాయాలు | Four Members Injured In Road Accident | Sakshi
Sakshi News home page

ఓల్వో బస్సు బోల్తా: నలుగురికి గాయాలు

Published Thu, Aug 23 2018 1:53 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

Four Members Injured In Road Accident  - Sakshi

రోడ్డు పక్కన బోల్తాపడిన ఓల్వో బస్సు   

ఇటిక్యాల : ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు అదుపు తప్పి బోల్తాపడటంతో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం మండలంలోని కొండేరు సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్‌ఐ జగదీశ్వర్‌ కథనం ప్రకారం.. ప్రైవేట్‌ ఆరెంజ్‌ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు బుధవారం తెల్లవారుజామున తిరుపతి నుంచి హైదరబాద్‌ వెళ్తుంది. ఈ క్రమంలో మండలంలోని కోండేరు గ్రామ స్టేజీ వద్ద డ్రైవరు నిద్రమత్తులోకి జారుకోవడంతో బస్సు అదుపు బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన సురేష్, ఆయన భార్య పద్మ, వారి కుమార్తె సౌమ్య, తిరుపతికి చెందిన మురళీకృష్ణలకు గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను హైవే అంబులెన్స్‌లో కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. బస్సులో మొత్తం 38 మంది ప్రయాణికులు ఉన్నారు. సంఘటన స్థలానికి ఎస్‌ఐ వెళ్లి ప్రయాణికులను ఇతర వాహనాల్లో హైదరాబాద్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement