మహబూబ్ నగర్: అడ్డాకుల మండలం వేముల గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆటో వేముల వైపు వెళ్తుండగా మధ్యలో ఒక కాలువ రావటంతో దాన్ని తప్పించే ప్రయత్నంలో ప్రమాదం సంభవించిందని ఆటో డ్రైవర్ తెలిపారు.