విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా నక్కపల్లి టోల్గేట్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు - లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఆ రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.