రెండు లారీల మధ్య నలిగిన కారు | Four Members Injured In Road Accident | Sakshi
Sakshi News home page

రెండు లారీల మధ్య నలిగిన కారు

Published Tue, May 29 2018 11:53 AM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM

Four Members Injured In Road Accident - Sakshi

ప్రమాదంలో నుజ్జయిన కారు

ఇచ్ఛాపురం : పట్టణానికి సమీపంలో పురుషోత్తపురం చెక్‌పోస్టు సమీపంలో గెడ్డ వద్ద  ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు చెప్పిన వివరాలు ప్రకారం... ఒడిశా నుంచి ఇచ్ఛాపురం వైపు వస్తున్న కారు ఎదురుగా ఆగివున్న లారీని ఢీకొట్టింది.

ఈ సమయంలో వెనుక వైపుగా వస్తున్న మరో లారీ కారును ఢీకొట్టింది. దీంతో రెండు లారీల మధ్య కారు నలిగిపోయింది.  కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో బరంపురం మెడికల్‌ ఆస్పత్రికి తరలించారు.

ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పట్టణ ఎస్‌ఐ బి.మంగరాజు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement