మంగపేట: వరంగల్ జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. మంగపేట గంపోనిగూడెం సమీపంలో ఓ కారు గోతిలో పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వెంకట్‌రెడ్డి, అతని భార్య నాగేశ్వరి, కుమారులు భార్గవ్, సాయి కిరణ్‌లు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం జిల్లా అశ్వాపురం వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మణుగూరు వైపు నుంచి వస్తున్న ఇసుక లారీని తప్పించే క్రమంలో కారు ముందున్న గోతిలో పడింది. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడిన నాగేశ్వరిని 108 వాహనంలో ఏటూరు నాగారం ఆస్పత్రికి తరలించారు.