లారీ, టెంపో ఢీ : నలుగురికి తీవ్ర గాయాలు | four injured in road accident in chittoor district | Sakshi
Sakshi News home page

లారీ, టెంపో ఢీ : నలుగురికి తీవ్ర గాయాలు

Published Sat, Aug 22 2015 9:47 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

four injured in road accident in chittoor district

చిత్తూరు : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం దండువారిపల్లె వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న టెంపో, చెన్నై నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కంటెయినర్ లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాలకు చెందిన డ్రైవర్లు, క్లీనర్లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చిత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement