బనగానపల్లె: కర్నూలు జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. బనగానపల్లి మండలం గులాంనబిపేట గ్రామం వద్ద వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కర్నూలులో ఓ శుభకార్యానికి హాజరైందుకు కడపకు చెందిన నలుగురు స్నేహితులు కారులో బయలుదేరారు. కారు గులాంనబిపేట గ్రామ శివారుకు వచ్చేసరికి రోడ్డుపై దట్టమైన పొగమంచు కమ్ముకొని ఉండటంతో.. అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇసాక్, విజయ్‌కుమార్, ప్రసన్నకుమార్, విక్కీలకు తీవ్రగాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.