ఫ్లైఓవర్పై నుంచి పడిన స్కార్పియో: ఒకరు మృతి | One killed in road accident in srikakulam district | Sakshi
Sakshi News home page

ఫ్లైఓవర్పై నుంచి పడిన స్కార్పియో: ఒకరు మృతి

Published Fri, Nov 27 2015 8:11 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

శ్రీకాకుళం కొత్తరోడ్డు ఫ్లైఓవర్ పైనుంచి వెళ్తున్న స్కార్పియో వాహనం అదుపు తప్పి కింద పడింది.

శ్రీకాకుళం : శ్రీకాకుళం కొత్తరోడ్డు ఫ్లైఓవర్ పైనుంచి వెళ్తున్న స్కార్పియో వాహనం అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనంలో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.... క్షతగాత్రులను శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహన్ని స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. బరంపురం నుంచి జైపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement