స్కూల్‌వ్యాన్ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.
నల్లగొండ: స్కూల్‌వ్యాన్ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అర్వపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. మండలంలోని అడివెంల గ్రామానికి చెందిన సైదులు (30) బైక్ పై పని మీద అర్వపల్లి వచ్చి...తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న స్కూల్ వ్యాన్ ఢీకొట్టింది.
దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్కూల్ వ్యాన్ను సీజ్ చేసి... డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.