చిత్తూరు జిల్లా మదనపల్లె బైపాస్ రోడ్డులో బుధవారం వాహనం బీభత్సం సృష్టించింది.
చిత్తూరు : చిత్తూరు జిల్లా మదనపల్లె బైపాస్ రోడ్డులో బుధవారం వాహనం బీభత్సం సృష్టించింది. రహదారిపై వాకింగ్ చేస్తున్న వారిపైకి టాటాఏస్ వాహనం దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో ఒక్కరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.... మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత టాటాఏస్ వాహనం డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.