ఆటో ఢీకొని వ్యక్తి దుర్మరణం
అనంతసాగరం (సోమశిల) : మితిమీరిన వేగంతో వెళ్తున్న ఓ ఆటో ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన అనంతసాగరంలో బుధవారం రాత్రి జరిగింది. ఏఎస్‌ఐ శ్రీనివాసరావు కథనం మేరకు.. అనంతసాగరానికి చెందిన సిద్దవటం పెంచలయ్య (47) బస్టాండ్ సమీపంలోని æతన ఇంటి నుంచి రోడ్డు మీదకు వస్తుండగా మండలంలోని లింగంగుంటకు చెందిన ఆటో బస్టాండ్ వైపు వెళ్తూ ఢీ కొంది. తీవ్రంగా గాయపడిన పెంచలయ్యను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందాడు. ఆటోడ్రైవర్ సంఘటనా స్థలం నుంచి డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కూలీ పనులు చేసుకుని జీవనం సాగించేవాడు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో కుటుంబలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.