పుణె నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న రెండు స్వల్ప తీవ్రత గల పేలుళ్లలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
పుణె: నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న రెండు స్వల్ప తీవ్రత గల పేలుళ్లలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. నారాయణ్గావ్లో ద్విచక్రవాహనం స్టార్ట్ చేస్తుండగా పేలుడు సంభవించి దేవిదాస్ కాలే అనే వ్యక్తి మరణించాడు.
ద్విచక్రవాహనం ఇంజన్ లో రసాయనిక చర్యవల్లే పేలుడు సంభవించి ఉంటుదని భావిస్తున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కొండ్వానాలో జరిగిన మరో ఘటనలో ఓ పాతసామాన్ల దుకాణంలో గ్యాస్ సిలండర్ పేలి ఒక వ్యక్తి గాయపడ్డాడు. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.