హైదరాబాద్ : శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్రోడ్డుపై గురువారం ఇసుక లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని హైదరాబాద్ నగరంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అతి వేగంగా కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.