outerring road
-
వారందరికీ కృతజ్ఞతలు: రాజశేఖర్
-
వారందరికీ కృతజ్ఞతలు: రాజశేఖర్
ప్రముఖ హీరో డాక్టర్ రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బుధవారం వేకువజామున రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. రామెజీఫిల్మ్ సిటీ నుంచి తన కారులో ఇంటికి వస్తుండగా కారు టైరు పగిలి డివైడర్‌ను ఢీకొని, కారు పల్టీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో రాజశేఖర్ స్వల్పగాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఈ ప్రమాదంపై అనేక వార్తలు వస్తున్న తరుణంలో రాజశేఖర్ మీడియా ముందుకు వచ్చారు. దేవుడి దయ వల్ల పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డానని ఆయన తెలిపారు. కారు పల్టీలు కొట్టడంతో ఒళ్లు నొప్పులున్నాయి తప్పా పెద్ద గాయాలు కాలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న వారితో పాటు తనపై ప్రేమాభిమానాలు కురిపించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను క్షేమంగా ఉన్నట్లు తెలిపిన రాజశేఖర్.. ఎవరూ ఆందోళన పడొద్దని ధైర్యం చెప్పారు. ‘ఈ ప్రమాదం జరిగినప్పట్నుంచి అనేక మంది మెసేజ్‌లు, ఫోన్లు చేసి నా యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. కొంతమంది ఇంటికి వచ్చి పరామర్శిస్తున్నారు. వీరందరి పలకరింపులు, నాపై చూపిస్తున్న ప్రేమ చూస్తేంటే చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్కటి చెప్పదల్చుకున్నాను. సినిమా ఇండస్ట్రీ అంతా ఒక ఫ్యామిలీ. అయితే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు చనిపోయిన వారి కుటంబసభ్యులను కలవడం కానీ, ప్రమాదాలకు గురై గాయపడ్డ వారిని పలకరించడం వంటివి చేయాలి. లేకపోతే వారి కుటుంబసభ్యులు బాధపడతారు. మనకు సినీ ఇండస్ట్రీలో ఎవరూ లేరా అని నిరుత్సాహపడతారు. అలాగే ఆరోగ్యం బాగోలేని వ్యక్తుల దగ్గరికి వెళ్లి దయచేసి పరామర్శించండి. ధైర్యం నింపండి. డిజిటల్ యుగంలో ఉన్నాం.. ఏదైనా జరిగినప్పుడు కనీసం ట్వీట్ చేయండి’అంటూ రాజశేఖర్ పేర్కొన్నారు. ఇక రాజశేఖర్ పూర్తి సందేశం కింది వీడియోలో.. -
దేవుడి దయవల్ల క్షేమంగా బయటపడ్డా
-
నాకు ఎటువంటి గాయాలు కాలేదు
-
అసలేం జరిగిందంటే?: రాజశేఖర్ వివరణ
సాక్షి, హైదరాబాద్: కారు ప్రమాదంలో తనకు ఎటువంటి గాయాలు కాలేదని, క్షేమంగా ఉన్నానని హీరో డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు కారుతో తననొక్కడినే ఉన్నానని వెల్లడించారు. అయితే ప్రమాదానికి గల కారణాలను ఆయన తెలపలేదు. అయితే అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్‌సిటీ నుంచి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కారులో నేను ఒక్కడినే ఉన్నాను. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, నా కారు దగ్గరకు వచ్చారు. లోపల ఉన్నది నేనే అని గుర్తు పట్టి, విన్ షీల్డ్ లోనుంచి బయటకు లాగారు. అప్పుడు నేను వెంటనే వారి ఫోన్ తీసుకుని మొదట పోలీసులకు, తర్వాత నా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడ నుంచి వారి కారులో ఇంటికి బయలు దేరాను. జీవిత, మా కుటుంబ సభ్యులు ఎదురు వచ్చి, నన్ను పికప్ చేసుకున్నారు. నాకు ఎటువంటి గాయాలు కాలేద’ ని అన్నారు. (చదవండి: హీరో రాజశేఖర్ కారుకు మరో ప్రమాదం) అతివేగమే కారణం: పోలీసులు రాజశేఖర్ కారు ప్రమాదంపై శంషాబాద్ పోలీసులు స్పందించారు. ఔటర్ రింగ్ రోడ్డులో పెద్ద గోల్కొండ టోల్ గేట్ వద్ద అదుపు తప్పి కారు బోల్తా కొట్టిందని శంషాబాద్ రూరల్ సీఐ వెంకటేష్ తెలిపారు. కారు(టీఎస్ 07 ఎఫ్‌జడ్ 1234)లో హీరో రాజశేఖర్ ఒక్కరే ఉన్నారని చెప్పారు.అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. రాజశేఖర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయని వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కారును తొలగించి పోలీస్ స్టేషన్‌కు తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. -
హీరో రాజశేఖర్ కు తప్పిన ప్రమాదం
-
హీరో రాజశేఖర్ కారుకు మరో ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హీరో డాక్టర్ రాజశేఖర్ మరోసారి రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది. రామెజీఫిల్మ్ సిటీ నుంచి తన కారులో ఇంటికి వస్తుండగా కారు టైరు పగిలి డివైడర్‌ను ఢీకొని, కారు పల్టీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులోని ఎయిర్‌బ్యాగ్స్ సకాలంలో తెరుచుకోవడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. కారులో రాజశేఖర్ ఒక్కరే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత రాజశేఖర్ మరో కారులో వెళ్లిపోయినట్టు సమాచారం. ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదని, ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. రెండేళ్ల క్రితం పీవీఎన్ఆర్ ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌వేలో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి రాజశేఖర్ బయటపడ్డారు. తన కారుతో మరొకరి వాహనాన్ని ఆయన ఢీకొట్టారు. అయితే బాధితుడు రామిరెడ్డితో వివాదం పరిష్కరించుకోవడంతో పోలీసులు నమోదు చేయలేదు. క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ పతాకంపై జి. ధనుంజయన్ నిర్మిస్తున్న సినిమాలో ప్రస్తుతం రాజశేఖర్ నటిస్తున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకుడు. ప్రమాదంలో ధ్వంసమైన రాజశేఖర్ కారు -
ఇసుక లారీ బోల్తా : ఒకరు మృతి
హైదరాబాద్ : శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్‌రోడ్డుపై గురువారం ఇసుక లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని హైదరాబాద్ నగరంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అతి వేగంగా కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.