‘ఈ ప్రమాదం జరిగినప్పట్నుంచి అనేక మంది మెసేజ్‌లు, ఫోన్లు చేసి నా యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. కొంతమంది ఇంటికి వచ్చి పరామర్శిస్తున్నారు. వీరందరి పలకరింపులు, నాపై చూపిస్తున్న ప్రేమ చూస్తేంటే చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్కటి చెప్పదల్చుకున్నాను. సినిమా ఇండస్ట్రీ అంతా ఒక ఫ్యామిలీ. అయితే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు చనిపోయిన వారి కుటంబసభ్యులను కలవడం కానీ, ప్రమాదాలకు గురై గాయపడ్డ వారిని పలకరించడం వంటివి చేయాలి. లేకపోతే వారి కుటుంబసభ్యులు బాధపడతారు. మనకు సినీ ఇండస్ట్రీలో ఎవరూ లేరా అని నిరుత్సాహపడతారు. అలాగే ఆరోగ్యం బాగోలేని వ్యక్తుల దగ్గరికి వెళ్లి దయచేసి పరామర్శించండి. ధైర్యం నింపండి. డిజిటల్ యుగంలో ఉన్నాం.. ఏదైనా జరిగినప్పుడు కనీసం ట్వీట్ చేయండి’అంటూ రాజశేఖర్ పేర్కొన్నారు.