ఒంగోలు: ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ప్లాజా వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనక ఉంచి వచ్చి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులోని ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. టోల్ప్లాజా సిబ్బంది వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు. నెల్లూరుకు చెందిన వారని పోలీసులు తెలిపారు. గోదావరి పుష్కరాల కోసం రాజమండ్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.