బైక్ అదుపు తప్పిపడి రైతు మృతి
అనుమసముద్రంపేట : బైక్ అదుపు తప్పి పడి ఓ రైతు దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన మండలంలోని సంగం–హసనాపురం ఆర్ అండ్‌బీ రోడ్డుపై సోమవారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. హసనాపురానికి చెందిన అబ్బూరు ఆదినారాయణ (55) సోమవారం మధాహ్నం పొలానికి వెళ్లాడు. సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చే సమయంలో సంగం నుంచి హసనాపురం వైపు వెళ్లే ద్విచక్ర వాహనదారులను లిఫ్ట్ అడిగాడు. కొందరు ఆపకుండా వెళ్లారు. ఏపీ 26ఏఎస్ 9184 నంబరు బైక్‌లో వెళ్తున్న వ్యక్తి ఆపి ఆదినారాయణను ఎక్కించుకున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో బైక్ అదుపు పడిపోయింది. ప్రమాదంలో కింద పడిన ఆదినారాయణ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం అనంతరం బైక్ నడుపుతున్న వ్యక్తి పరారీ అయ్యాడు. ఎస్‌ఐ వెంకటసాయి తన సిబ్బందితో వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదినారాయణ మృతి చెందిన విషయం తెలుసుకున్న బం«ధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.