విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు వద్ద ఓ లారీ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
విజయనగరం : విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు వద్ద ఓ లారీ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బిహార్‌కు చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖపట్నం నుంచి రూర్కెలాకు లారీలో అమ్మోనియం నైట్రేట్ తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.