చిత్తూరు : చిత్తూరు జిల్లా గుడిపాల మండలం చీలపల్లె సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బస్సు- లారీ ఢీ: ఒకరి మృతి
Published Wed, Sep 14 2016 8:09 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement