రైల్లోంచి జారిపడి వ్యక్తి మృతి
నెల్లూరు (క్రైమ్) : ప్రమాదవశాత్తు రైల్లోంచి జారిపడి గుర్తుతెలియని (40) వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డు సమీప రైలు పట్టాల వద్ద చోటు చేసుకుంది. మృతుడు లేత బ్లూ (స్కైబ్లూ)రంగు ఫుల్‌హ్యాండ్స్ చొక్కా, నలుపు రంగు కాటన్ జీన్స్ ధరించి ఉన్నాడు. మృతుడి జేబులో టెస్టర్ ఉంది. విషయం తెలుసుకున్న రైల్వే హెడ్ కానిస్టేబుల్ జోసఫ్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు ఎలక్ట్రీషియన్ అయి ఉండొచ్చునని భావిస్తున్నారు. మృతదేహాన్ని డీఎస్‌ఆర్ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.