పెళ్లి ఇంట్లో చావు బాజా | Vehicle over turns: one killed | Sakshi
Sakshi News home page

పెళ్లి ఇంట్లో చావు బాజా

Published Fri, Aug 26 2016 2:26 AM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

పెళ్లి ఇంట్లో చావు బాజా

పెళ్లి ఇంట్లో చావు బాజా

  •  పెళ్లివారి వాహనం బోల్తా ఒకరి మృతి
  • 14 మందికి  గాయాలు
  • గోనుపల్లిలో విషాదఛాయలు 
  • రాపూరు : పెళ్లి ఇంట్లోచావు బాజా మోగింది. మండలంలోని గోనుపల్లి అరుంధతీయవాడకు చెందిన పెళ్లి బృందం జీపులో తిరుపతికి వెళ్తుండగా గుండవోలు సమీపాన ఉన్న మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడటంతో ఒకరు మృతి చెందగా, 14 మందికి గాయాలు పడ్డారు. ఈ గురువారం రాత్రి చోటు చేసుకుంది. గోనుపల్లికి చెందిన వడ్లపల్లి జయరామయ్య, రమణమ్మ కుమార్తె చామండేశ్వరికి తిరుపతికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయం కావడంతో గోనుపల్లిలో గురువారం రాత్రి సుమారు 7 గంటలకు జీపులో కొందరు, లారీలో మరి కొందరు బయలుదేరారు. జీపు గుండవోలు వద్ద ఉన్న మలుపు వద్ద అదుపు తప్పడంతో జీపులో ఉన్న 15 మందిలో 14 మందికి గాయాలయ్యాయి. పెళ్లికొడుకు తరపున సారె తీసుకు వచ్చిన సూరిపాక జయరామయ్య (65) తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.

    విషయం తెలుకున్న గుండవోలు, ఆకలివలస గ్రామస్తులు 108 సిబ్బంది హుటాహుటిన సంఘనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనం, మినీ బస్సు, లారీలో రాపూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇక్కడ ఒక్క వైద్యుడు మాత్రమే ఉండడంతో సైదాపురం, డక్కిలికి చెందిన 108 వాహనాల్లో ప్రైవేట్‌ కారుర్లలో నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రుల్లో డ్రైవర్‌ పశుపులేటి శీను (తిరుపతి) పాదర్తి పెంచలమ్మ,పాదర్తి మానస (పెద్దచెరుకూరు) బోపం చిట్టేమ్మ, బోపినేని వెంకటేశ్వర్లు (తిరుమల) బోపం కృష్ణయ్య, బోపినేని చిన్నయ్య (నేతివారిపల్లి, చిట్వేలి మండలం) సత్యవేలు మాతమ్మ (చీపినాపి, కలువాయి మండలం) వడ్డిపల్లి లక్ష్మీనరసమ్మ, బుజ్జమ్మ (గోనుపల్లి), మాతంగి మాతయ్య(గూడూరు),  వడ్డిపల్లి మణి (తెగచర్ల) ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement