ఎల్లారెడ్డిలో దారుణ హత్య | one murdered in nizamabad district | Sakshi
Sakshi News home page

ఎల్లారెడ్డిలో దారుణ హత్య

Published Fri, Oct 23 2015 3:18 PM | Last Updated on Sun, Sep 3 2017 11:22 AM

one murdered in nizamabad district

ఎల్లారెడ్డి: నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలంలో గురువారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పాతకక్షల నేపథ్యంలో మల్లాయిపల్లిలో పోచయ్య(55) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చారు.

పోచయ్యకు అతని తమ్ముడు బాలయ్యతో కొన్నేళ్లుగా విభేదాలున్నాయి. హత్య జరిగిన తర్వాత బాలయ్య కనిపించకపోవటంతో ఈ హత్య అతడే చేసి ఉంటాడని పోచయ్య కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement