ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది.
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఎయిర్ పోర్టు గేట్ ఎదురుగా భారీ ఎత్తున పేలుడు పదార్ధాలతో కూడిన కారుతో ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేశారు. ఈ సంఘటనలో ఉగ్రవాది మృతి చెందినట్లు పోలీస్ అధికారులు ధ్రువీకరించారు. మరోవైపు కాబూల్ విమానాశ్రయం సమీపంలో ఆత్మాహుతి దాడి జరగటం వారంలో ఇది రెండోసారి. డిసెంబర్ 28న జరిగిన ఆత్మాహుతి దాడిలో ఉగ్రవాదితో పాటు ఓ పౌరుడు మృతి చెందగా, మరో 13మంది గాయపడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.