ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ | one naxal killed in chattisgarh encounter | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

Published Sat, Dec 17 2016 9:55 AM | Last Updated on Sat, Jul 28 2018 8:20 PM

one naxal killed in chattisgarh encounter

వరంగల్: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగులోకి ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కాల్మెట్టా అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టిన పోలీసులకు, మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక నక్సల్ చనిపోయాడు.
 
మృతుడిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలం కొంగల్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు మృతదేహాన్ని గుర్తించి, తీసుకువచ్చేందుకు శుక్రవారం బీజాపూర్ బయలుదేరి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement