మండలంలోని ఉప్పాడపేట కూడలి వద్ద జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందా డు.
భోగాపురం : మండలంలోని ఉప్పాడపేట కూడలి వద్ద జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందా డు. వివరాల్లోకి వెళితే.. హెరిటేజ్ కంపెనీకి చెందిన టాటా మ్యాజిక్ వాహనం విశాఖపట్నం నుంచి పూసపాటిరేగ వస్తుండగా బుధవారం రాత్రి 1.30 సమయంలో ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని వెనుకనుంచి బలంగా ఢీకొంది.
ఈ సంఘటనలో టాటా మ్యాజిక్‌లో ముందుభాగంలో ఎడమవైపు కూర్చున్న విశాఖపట్నం సరబన్నపాలెంనకు చెందిన దూలి శివప్రసాద్(25) అక్కడికక్కడే మరణించాడు. డ్రైవరు వేమల నాగేశ్వరరావుకి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసకున్న హెచ్‌సీ అప్పారావు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.