థానే: మహారాష్ట్రలో ఓ స్కూల్ వద్ద హీలియం వాయువుతో నిండిన సిలిండర్ పేలి ఒక చిన్నారి ప్రాణాలుకోల్పోయింది. 13మంది గాయాలపాలయ్యారు. గాయపడినవారిలో ఎనిమిదిమంది చిన్నారులు ఉన్నారు.
థానే జిల్లాలోని కల్యాణ్ ప్రాంతంలో ఓ పాఠశాల వద్ద బెలూన్లు విక్రయించే వ్యక్తి బెలూన్లలో హీలియం గ్యాస్ నింపుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
స్కూల్ వద్ద హీలియం సిలిండర్ పేలుడు
Published Thu, Dec 24 2015 5:07 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement