
స్నేహితుల చేతిలో యువకుడి హత్య
స్నేహితుల నడుమ తలెత్తిన చిరు వివాదం ఒకరి హత్యకు దారి తీసింది...
చిరు వివాదంతో ఘటన
పహాడీషరీఫ్: స్నేహితుల నడుమ తలెత్తిన చిరు వివాదం ఒకరి హత్యకు దారి తీసింది. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసుల ప్రకారం... ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఫరికార్ ఖాన్(30), అతని స్నేహితులు రామాన్‌జన్ షా, బుద్దు, కేజూ, అనిల్, సూరజ్, రాజ్‌కుమార్‌లు తుక్కుగూడలోని హెచ్‌సీఎల్ కంపెనీలో రెండు నెలలుగా పెయింటర్లుగా పని చేస్తున్నారు. వీరంతా హెచ్‌సీఎల్‌లోనే ఓ గదిలో ఉంటున్నారు. ఆదివారం రాత్రి ఫరికార్ తన స్నేహితుడు అనిల్‌కు ఫోన్ చేసి అన్నం వండమని చెప్పాడు. ఇంటికి చేరుకున్నాక ఫరికార్ అతని స్నేహితుల మధ్య చిరు వివాదం తలెత్తింది. తీవ్ర ఆగ్రహానికి గురైన రామానుజన్ షా, బుద్దు, కేజూలు కత్తితో ఫరికార్ వీపు, ఛాతి భాగాల్లో పొడిచారు. దీంతో ఫరికార్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.