రూ. 30 బాకీ కోసం ఘర్షణ | One killed because of rs 30 | Sakshi
Sakshi News home page

రూ. 30 బాకీ కోసం ఘర్షణ

Published Wed, Mar 1 2017 1:01 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM

One killed because of rs 30

చికిత్స పొందుతూ ఒకరి మృతి

చిల్పూరు (స్టేషన్‌ ఘన్‌పూర్‌): గుడుంబా విక్రయ కేంద్రంలో జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. జనగామ జిల్లా చిల్పూరు మండలం మల్కాపూర్‌కు చెందిన అన్నెబోయిన లింగయ్య (35) ఓ గుడుంబా విక్రయ కేంద్రంలో ఖాతాదారుడు. ఈ నెల 24న పాత అప్పును చెల్లించేందుకు లింగయ్య బస్తా బియ్యం తీసుకెళ్లాడు.

ముందుగా గుడుంబా తాగిన తర్వాత వాటిని విక్రయదారునికి అందజేశాడు. ఇంకా రూ. 30 బాకీ ఎవరు కడతారని గుడుంబా విక్రయదారుడు అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గుడుంబా అమ్మకందారులు ఒకటై లింగయ్యపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. లింగయ్యను ఆస్పత్రిలో చేర్పించగా, మంగళవారం మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement