వ్యాన్ ఢీకొని యువకుడి దుర్మరణం
నాయుడుపేట : మితి మీరిన వేగంతో వెళ్తున్న ఓ మినీ వ్యాన్ ఎదురుగా వస్తున్న ఆటోను, ఆ తర్వాత బైక్‌ను ఢీకొనడంతో ఒకరు దుర్మరణం చెందగా, ఆటోడ్రైవర్ గాయపడ్డాడు. ఈ సంఘటన నాయుడుపేట–మల్లాం మార్గంలో మిట్టకండ్రిగ వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగింది. మల్లాం నుంచి నాయుడుపేట వైపు వస్తున్న ఆటోను, దాని వెనుకనే వస్తున్న బైక్‌ను ఎదురుగా వస్తున్న మినీ వ్యాన్ ఢీకొంది. ఆటోబోల్తా పడగా ఆటోడైవర్ పుదూరుకు చెందిన గోనుపల్లి కుమార్ స్వల్ప గాయాలయ్యాయి. మోటార్ బైక్‌పై వస్తున్న రామారెడ్డికండ్రిగకు చెందిన మైలారి అనిల్ (29) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన కుమార్‌ను 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనిల్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.