nayudupet
-
రైలు ఢీకొని నేపాల్ వాసి దుర్మరణం
నాయుడుపేటటౌన్ : ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని నేపాల్‌వాసి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన నాయుడుపేట రైల్వేస్టేషన్ టికెట్ కౌంటర్ వద్ద మంగళవారం తెల్లవారు జామున జరిగింది. రైల్వే పోలీసుల సమాచారం మేరకు.. నేపాల్ దేశానికి చెందిన మెక్ బహదూర్ (43) స్టేషన్లో రైలు పట్టాలు దాటుతుండగా చెన్నై వైపు నుంచి వెళ్తున్న గోహతి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొంది. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే హెడ్‌కానిస్టేబుల్ జానకీరామ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అతని వద్ద లభించిన పర్సులో ఉన్న ఓటర్, పాన్, ఏటీఎం కార్డులతో పాటు నేపాల్ దేశానికి చెందిన కరెన్సీ ఉండడాన్ని గుర్తించారు. ఽఓటరు కార్డులో మెక్ బహదూర్, తండ్రి ఖదక్ బహదూర్ 2/ఎన్ఏ అన్నాసాలై, నాగల్కని, క్రోమ్‌పేట, చెన్నై అనే వివరాలు ఉండటం అతను చెన్నైలో స్థిర నివాసం ఉంటున్నట్లు భావిస్తున్నారు. అతని పర్సులో నేపాల్‌కు చెందిన కరెన్సీతో పాటు చెన్నై ఐడీబీఏ బ్యాంక్‌లో రూ.40 వేలు నగదు జమ చేసినట్లు ఓచర్లు ఉండడాన్ని రైల్వేపోలీసులు గుర్తించారు. రాక్సుల్ జంక్షన్ నుంచి చెన్నై సెంట్రల్ వరకు రైల్వే టికెటు ఉంది. చెన్నైలోని జనరల్ ఇండస్ట్రీయల్ లెదర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నట్లుగా గుర్తింపు కార్డు ఉంది. వీటి ఆధారంగా వారికి సమాచారం అందించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
వృద్ధురాలు ఆత్మహత్య
నాయుడుపేటటౌన్ : స్థానికులు చూస్తుండగానే ఓ వృద్ధురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలోని పొగగొట్టం కాలనీలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. దొరవారిసత్రం మండలం తల్లంపాడు పంచాయతీ ముత్తారాశిపాళెంకు చెందిన చాపల గంగమ్మ (85) పొగగొట్టం కాలనీలో ఉన్న కోడలుకు చెందిన గుడిసెలో కొద్ది రోజులుగా నివాసం ఉంటుంది. రెండు రోజుల క్రితం ముత్తారాశిపాళెంకు వెళ్లి పింఛన్ కూడా తెచ్చుకుంది. ఆమె మానసిక స్థితి సరిగాలేక ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు తెలుస్తోంది. హఠాత్పరిణామానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. అప్పటికే వృద్ధురాలు చాలావరకు కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
సీజ్డ్ ధాన్యం, బియ్యం గల్లంతు
సప్తగిరి రైస్‌మిల్లు మేనేజర్‌పై కేసు నమోదు నాయుడుపేటటౌన్ : జిల్లా సివిల్ సప్లయీస్ అధికారులు సీజ్ చేసిన సుమారు రూ.46 లక్షల విలువైన ధాన్యం, బియ్యంను నాయుడుపేట సప్తగిరి రైస్‌మిల్లు వద్ద భద్రపరచగా అవి గల్లంతైనట్లు ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు అందింది. సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ పీవీ కొండయ్య సమాచారం మేరకు.. జిల్లా సివిల్ సప్లయీస్ అధికారులు తుమ్మూరు సమీపంలో ఉన్న శ్రీదేవి రైస్‌మిల్లుకు సీఎమ్మార్ ధాన్యంను అప్పగించగా వాటిని ప్రభుత్వానికి తిరిగి చెల్లించకుండా మోసం చేయడంతో గత సెప్టెంబర్ నెల 30వ తేదీన రైస్‌మిల్లు తనిఖీలు చేపట్టి రూ.1.32 కోట్లు మోసం చేసినట్లు మిల్లు యజమాని బొల్లినేని కుమారస్వామినాయుడుపై కేసు నమోదు చేశామన్నారు. అదే రోజు రైస్‌మిల్లులో 343.50 క్వింటాళ్ల బీపీటీ ధాన్యం, 966.50 క్వింటాళ్ల గ్రేడ్ ఏ బియ్యంను సీజ్ చేసి నాయుడుపేట సప్తగిరి రైసుమిల్లుకు భద్రపరిచేందుకు అప్పగించామన్నారు. అయితే ప్రభుత్వం భద్రపరిచిన ధాన్యం, బియ్యంను తనిఖీ చేసేందుకు వెళ్లగా అక్కడ లేకుండా అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాటిని విక్రయించేసి ఉండడాన్ని అధికారులు గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ధాన్యం, బియ్యం గల్లంతుపై మిల్లు మేనేజర్ పీ వీరరాఘవరెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఎస్బీహెచ్ ఏటీఎం ధ్వంసం
నాయుడుపేటటౌన్: పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల వెనుక వీధిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదారబాద్ ఏటీఎంను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఏటీఎంలో నగదు ఉడే సెల్లర్‌ను పగలగోట్టేందుకు ప్రయత్నించి రాకపోవడంతో పరారయ్యారు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దుండగులు మొదట ఏటీఎంలోకి ప్రవేశించిన సీసీ కెమెరాల వైర్లను తొలగించారు. ఈ విషయమై బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్‌టీం వెలిముద్రలు తీసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి ఏటీఎంలోకి వెళ్లి తలుపులు వెసుకున్న వైనాన్ని ఐడీ పార్టీ పోలీసులు పరిశీలించారు. అయితే ఆ పూటేజీలో స్పష్టత లేదన్నారు. -
8 వాహనాలు ధ్వంసం
ఒక్కదానికొక్కటి ఢీకొన్న వైనం నాయుడుపేటటౌన్ : నిత్యం రద్దీగా ఉండే రహదారిపై రెప్పపాటులో రెండు లారీలు ఒక్కదానికొక్కటి ఢీకొనడంతో వాటి వెనుకనే వస్తున్న మరో 6 వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ సంఘటన నాయుడుపేట సమీపంలోని పూతలపట్టు బైపాస్‌రోడ్డుపై బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. అ తమిళనాడులోని తిరువళ్లూరు నుంచి ఓ భారీ పరికరాన్ని కంటైనర్ లారీపై గూడూరు సమీపంలోని మీనాక్షి పవర్ ప్లాంట్‌కు తరలించుకుపోతున్నారు. ఈ లారీ బైపాస్‌రోడ్డు సమీపంలో పెట్రోల్ బంకువద్ద పైన విద్యుత్ వైర్లు తగులుతుండటంతో లారీని నిలిపివేశారు. విద్యుత్ వైర్లను పైకి లేప్పి లారీని తరలించే ప్రయత్నాలు చేశారు. ఈ లారీ వెనుకనే మరో రెండు లారీలు నిలబడి ఉన్నాయి. ఈ క్రమంలో తమిళనాడులోని సెలం నుంచి వైజాగ్‌కు కెమికల్ లోడుతో వస్తున్న భారీ ట్యాంకర్ అతివేగంగా వచ్చి రోడ్డు మీద నిలబడి ఉన్న లారీలను ఢీకొంది. దీంతో అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న మెకానిక్ షెడ్‌పై దూసుకువెళ్లి అక్కడ ఉన్న రెండు ఆటోలు, అంబులెన్స్ వాహనం, ట్రాక్టర్‌తో పాటు ఓ కారును ఢీకొని నిలబడిపోయింది. ఈ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో మరో పార్శిల్ లారీ మరో వైపు జనాల మీదకు దూసుకెళ్లడంతో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి విద్యుత్ స్థంభానికి ఢీకొని నిలబడిపోయింది. ట్యాంకర్లో ఉన్న డ్రైవర్ ఎన్ దినేష్‌కు మరో పార్శిల్ లారీలో ఉన్న డ్రైవర్లు రాజన్బహుదూర్, రాంజత్తన్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్తంభించిన ట్రాఫిక్ భారీ పరికరంతో వచ్చిన వాహనం రోడ్డు మధ్యలో నిలబడి ప్రమాదానికి కారణం కావడమేగాక వాహనాలు ధ్వంసమై నిలబడిపోవడంతో రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న ఎస్ఐ మారుతీకృష్ణతో పాటు ఏఎస్ఐలు కృష్ణయ్య, శంకర్రాజు పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. రహదారిపై అడ్డంగా ఉన్న వాహనాలను పక్కకు జరిపి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రమాదానికి ప్రధాన కారణమైన భారీ పరికరం తీసుకు వస్తున్న వాహన డ్రైవర్ విఘ్నేశ్వర్తో పాటు ట్యాంకర్ డ్రైవర్ దినేష్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
అనుమానాస్పద స్థితిలో లారీడ్రైవర్ మృతి
నాయుడుపేటటౌన్ : అనుమానాస్పదస్థితిలో ఓ లారీడ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని మేనకూరులో శనివారం వెలుగుచూసింది. పోలీసుల సమాచారం మేరకు.. చిట్టమూరు మండలం మెట్టుకు చెందిన దార్ల రాజశేఖర్ (24) లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ తల్లిని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో కృష్ణపట్నం పోర్టు నుంచి బొగ్గు లోడు తీసుకుని మేనకూరు పరిశ్రమ కేంద్రంలోని హిందూస్తాన్ గ్లాస్ పరిశ్రమకు అన్లోడ్ చేసేందుకు శుక్రవారం రాత్రి వెళ్లాడు. అప్పటికే మరికొన్ని లారీలు బొగ్గు అన్లోడ్ చేస్తుండటంతో పరిశ్రమ బయట లారీల వెనకే రాజశేఖర్ తన లారీని నిలిపాడు. శనివారం ఉదయం లారీ పక్కనే డివైడర్‌పై చెయ్యి విరిగి అపస్మారక స్థితిలో పడి ఉన్న రాజశేఖర్‌ను ఇతర డ్రైవర్లు గుర్తించారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ గార్డుకు తెలపడంతో లారీడ్రైవర్ల సహకారంతో ఆటోలో నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రిలో వైద్యసేవలు అందిస్తుండగా రాజశేఖర్ మృతి చెందాడు. అయితే రాజశేఖర్ మృతికి కారణాలు తెలియకపోవడంతో ఏఎస్సై కృష్ణయ్య అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. మృతదేహానికి ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నా కొడుకును ఎవరో కొట్టి చంపేశారు.. నా కొడుకును ఎవరో కొట్టి చంపేశారంటూ మృతుడి తల్లి పెంచలమ్మ ఆరోపించింది. కొడుకు మృతి విషయం తెలుసుకుని ఆస్పత్రి వద్దకు చేరుకుని బోరున విలపించింది. భర్త మణెయ్య మృతి తర్వాత ఒక్కగానొక్క కొడుకు కుటుంబానికి ఆధారంగా ఉన్నాడని, నాకు దిక్కెవరంటూ తల్లి గుండెలు బాదుకుంటూ రోదిస్తూ సొమ్మసిలి పడిపోయింది. అందరితో సఖ్యతగా ఉండే సుబ్రహ్మణ్యం మృతితో కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. -
వ్యాన్ ఢీకొని యువకుడి దుర్మరణం
నాయుడుపేట : మితి మీరిన వేగంతో వెళ్తున్న ఓ మినీ వ్యాన్ ఎదురుగా వస్తున్న ఆటోను, ఆ తర్వాత బైక్‌ను ఢీకొనడంతో ఒకరు దుర్మరణం చెందగా, ఆటోడ్రైవర్ గాయపడ్డాడు. ఈ సంఘటన నాయుడుపేట–మల్లాం మార్గంలో మిట్టకండ్రిగ వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగింది. మల్లాం నుంచి నాయుడుపేట వైపు వస్తున్న ఆటోను, దాని వెనుకనే వస్తున్న బైక్‌ను ఎదురుగా వస్తున్న మినీ వ్యాన్ ఢీకొంది. ఆటోబోల్తా పడగా ఆటోడైవర్ పుదూరుకు చెందిన గోనుపల్లి కుమార్ స్వల్ప గాయాలయ్యాయి. మోటార్ బైక్‌పై వస్తున్న రామారెడ్డికండ్రిగకు చెందిన మైలారి అనిల్ (29) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన కుమార్‌ను 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనిల్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆగిన లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఇద్దరు దుర్మరణం 11 మందికి గాయాలు నాయుడుపేట : అర్ధరాత్రి వేళ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొని కండక్టర్‌తో పాటు ఓ ప్రయాణికుడు దుర్మరణం చెందారు. ఈ విషాద సంఘటన చెన్నై– కోల్కత్తా జాతీయ రహదారిపై మండలంలోని నరసారెడ్డి కండ్రిగ సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. గూడూరు నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ శ్రీధర్ నరసారెడ్డి కండ్రిగ సమీపానికి వచ్చే సరికి కునుకు తీయడంతో మరమ్మతులకు గురై రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుకవైపు ఢీకొంది. బస్సు ఎడమవైపు కండక్టర్ సీట్ వరకు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో గూడూరు మండలం చవటపాళెంకు చెందిన కండక్టర్ కావాడి మునీంద్ర (38) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కండక్టర్ వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణికుడు ప్రకాశం జిల్లా నాగులఉప్పలపాడు మండలం ఉప్పు కొండూరుకు చెందిన వలకలూరి సుధాకర్ (40) తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది ప్రయాణికుల్లో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం వెంకటరాజులకండ్రిగ గ్రామానికి చెందిన గోగుల సాయికృష్ణకు తలపై తీవ్ర గాయం కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం సిమ్స్‌కు తరలించారు. ఆయన భార్య చందన, అత్త వేముల శారదకు స్వల్పగాయాలయ్యాయి. వీరు శ్రీశైలం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా ఎలుతూరు కండ్రిగకు చెందిన చెన్నవరపు సుబ్బరత్న, మన్నెమాల శాంతి, గూడూరు ఇందిరానగర్‌కు చెందిన గణపతి స్వదీప్, పొదలకూరు మండలం అమ్మవారిపాళెంకు చెందిన రావులపల్లి వెంకటేశ్వర్లు, ప్రకాశం జిల్లా యదనపూడి మండలం జాగర్లమూడికి చెందిన తుమ్ములూరు రవి, నెల్లూరు నవాబుపేటకు చెందిన బుల్లా శివకుమార్‌రెడ్డి, శ్రీకాకుళం జిల్లా జూలమూరు మండలం వరమాటివలత గ్రామానికి చెందిన గొండు రమణయ్య, పొన్నా కృష్ణ స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను 108లో నాయుడుపేట ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలలకు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మృతి చెందిన కండక్టర్, ప్రయాణికుడి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఆలస్యంగా చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన విషయం స్థానిక పోలీసులకు సమాచారం అందించినా సకాలంలో స్పందించకుండా ఆలస్యంగా ఘటన స్థలికి చేరుకున్నారు. డ్రైవర్ శ్రీధర్ గూడూరు డిపోకు సమాచారం అందించడంతో ఆర్టీసీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ప్రయాణికులకు దగ్గర ఉండి వైద్య సదుపాయం అందేలా చర్యలు చేపట్టారు. చెల్లెలు చెంగమ్మ రాఖీ ఎవరికి కట్టాలి తమ్ముడు తమ్ముడూ మమ్మల్ని వదిలి వెళ్లిపోయావా.. చెల్లెలు చెంగమ్మా రాఖీ ఎవరికి కడుతుంది అంటూ మృతుడు కండక్టర్ కావాడి మునీంద్ర అన్న మునిరాజ స్థానిక ఆసుపత్రి వద్ద గుండెలు పగిలేలా రోదించారు. ఒక్కగానొక్క చెల్లెలు చెంగమ్మ అన్న డ్యూటీ నుంచి ఇంటికి వస్తాడు రాఖీ కట్టాలంటూ నీ కోసం రాఖీతో ఎదురు చూస్తుంది తమ్ముడు అంటూ విలవిలాడిపోయాడు. ఆ చెల్లికి నేనేమి సమాధానం చెప్పాలి అంటూ గుండెలు బాధుకున్నాడు. నలుగురి అన్నదమ్ములకు ఒకే చెల్లెలు చెంగమ్మ ఇక ఏ అన్నకు రాఖీ కట్టాలంటూ బోరున విలపించడం చూసిన చవటపాళెం గ్రామస్తులకు కంటతడి పెట్టించింది. పొట్టకూటి కోసం వచ్చి మృత్యు ఒడిలోకి.. పొట్టకూటి కోసం కూలీ పనులకు వచ్చి మృత్యు ఒడిలోకి చేరుకోవడంతో ప్రకాశం జిల్లా కూలీలు మేస్త్రీ వలకలూరి సుధాకర్ మృతి చెందటంతో విషాదంలో మునిగిపోయారు. సొంత ఊరిలో కూలీపనులు లేక వలస వచ్చి నాయుడుపేట బాలుర గురుకుల పాఠశాలలో ట్యాంకు నిర్మాణ పనులకు ప్రకాశం జిల్లా ఉప్పుకొండూరు నుంచి గూడూరుకు రైలులో వచ్చాడు. అక్కడి నుంచి గూడూరు–తిరుపతి బస్సు ఎక్కిన సుధాకర్‌ను విధి కాటేసింది. -
‘పినాకినీ’ కష్టాలు..
నాయుడుపేట: ఓ వైపు టికెట్లు ఇస్తూనే మరోవైపు నాయుడుపేటలో పినాకిని ఎక్స్‌ప్రెస్‌ను నిలపకపోవడంతో ప్రయాణికులు చైన్ లాగి ఆపుతున్నారు. వరుసగా రెండో రోజూ కూడా చైన్ లాగిపోవడంతో రైలు ఆగిపోయింది. ఈ క్రమంలో లోకోపైలెట్లతో పాటు ఆర్పీఎఫ్ సిబ్బంది హుటాహుటిన పరుగులు తీసి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలో టికెట్లు ఇచ్చినందునే తాము ఎక్కామని యువకులు సమాధానమిచ్చారు. మరోవైపు పినాకిని ఎక్స్‌ప్రెస్ ఆకస్మాత్తుగా ఆపేయడంతో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కూడా ఐదు నిమిషాలు నిలిచిపోయింది. -
గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య
ఆనవాలు తెలియకుండా పెట్రోల్ పోసి తగులబెట్టిన వైనం నాయుడుపేట టౌన్ : వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే జాతీయ రహదారి సమీపంలోనే ఓ గుర్తుతెలియని వ్యక్తిని హత్యచేసి ఆనవాలు తెలియకుండా పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన పట్టణంలోని తుమ్మూరు సమీపంలో బుధవారం వెలుగుచూసింది. గూడూరు డీఎస్పీ శ్రీనివాసులు సమాచారం మేరకు.. తుమ్మూరు స్వర్ణముఖి బ్రిడ్జి సమీపంలో రోడ్డు పక్కన చంద్రకళ అనే మహిళ నివాసం ఏర్పాటు చేసుకుని బీడీ బంకు నిర్వహించుకుంటుంది. తన ఇంటి ముందు సుమారు 35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తిని హత్యచేసి తగులబెట్టినట్లుగా 100కు సమాచారం అందడంతో స్థానిక సీఐ రత్తయ్యతో పాటు సర్కిల్ పరిధిలోని ఎస్సైలు పీవీ నారాయణ, రవినాయక్, మారుతికృష్ణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సమీపంలో ఉన్న మరో బంకు వెనుక అతనిపై తీవ్రంగా రాయితో దాడి చేసి గొంతునులిమి ఊపిరాడకుండా హత్యచేసి ఎండిన తాటిఆకులు, ప్లాస్టిక్ పట్టలు వేసి మృతదేహాన్ని కాల్చివేసి ఉండడాన్ని గుర్తించామన్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం పోలీసుల పరిశీలన స్థానిక సీఐ రత్తయ్య ఆధ్వర్యంలో పోలీసు అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు నుంచి బిందు అనే జాగిలంతో ప్రాథమిక ఆధారాల కోసం గాలించారు. హత్య జరిగిన ప్రదేశం నుంచి జాగిలం రోడ్డు పక్కన తగులబెట్టిన మృతదేహం వద్దకు వెళ్లింది సమీపంలో శిథిలస్థితిలో తాటి ఆకులతో కప్పి ఉన్న గుడిసె లోపలికి వెళ్లి చుట్టుపక్కల తిరిగింది. అక్కడి నుంచి నేరుగా అన్నమేడు రైల్వేగేటు దాటుకుని వెళ్లి ఓ చెట్టుకింద నిలబడింది. శిథిలస్థితిలో ఉన్న గుడిసెలో పెయింటర్ నాగరాజు అనే వ్యక్తి రోజు మద్యం సేవించి వచ్చి అక్కడ నిద్రించేవాడని చంద్రకళ పోలీసులకు వివరించింది. అయితే ఆ వ్యక్తి పరారీ కావడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్లూస్‌టీం ఎస్సై శరత్‌బాబు హత్య జరిగిన ప్రదేశంలో క్షుణంగా పరిశీలన చేశారు. మృతుడిని బండరాయితో మోదినప్పుడు అక్కడ పడి ఉన్న దంతాలను సైతం పరిశీలించారు. సమీపంలో మద్యం బాటిళ్లు తదితర వస్తువులు, మృతుడి చెప్పులను క్లూస్ టీం పోలీసులు గుర్తించారు. మోటార్ బైక్ కీ, వాటర్ బాటిళ్లు సైతం గుర్తించారు. అయితే బంకు వెనుక హత్యచేసి నిత్యం వాహన రాకపోకలు జరిపే రహదారి పక్కన తీసుకువచ్చి ఓ ఇంటి ముందు పడేసి కాల్చివేయడంపై పోలీసులు పలు అనుమానలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం పడి ఉన్న ఇంటి వద్ద నివాసం ఉంటున్న చంద్రకళ ఆమె భర్త రమేష్‌ను సీఐతో పాటు పోలీసులు పూర్తిస్థాయిలో విచారించారు. మృతుడు ఆనవాలు తెలియకుండా చేసిన వైనం మృతుడు ఫుల్ హ్యండ్ షర్ట్ ధరించి ఉన్నాడు. మృతుడి కుడిచేతికి ఎరుపు రంగు ధారంతో పాటు స్వాములు ధరించే పూసలతాడు తెగిపోయి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు.