రైలు ఢీకొని నేపాల్ వాసి దుర్మరణం
రైలు ఢీకొని నేపాల్ వాసి దుర్మరణం
Published Wed, Nov 9 2016 1:46 AM | Last Updated on Sat, Oct 20 2018 6:40 PM
నాయుడుపేటటౌన్ : ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని నేపాల్‌వాసి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన నాయుడుపేట రైల్వేస్టేషన్ టికెట్ కౌంటర్ వద్ద మంగళవారం తెల్లవారు జామున జరిగింది. రైల్వే పోలీసుల సమాచారం మేరకు.. నేపాల్ దేశానికి చెందిన మెక్ బహదూర్ (43) స్టేషన్‌లో రైలు పట్టాలు దాటుతుండగా చెన్నై వైపు నుంచి వెళ్తున్న గోహతి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొంది. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే హెడ్‌కానిస్టేబుల్ జానకీరామ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అతని వద్ద లభించిన పర్సులో ఉన్న ఓటర్, పాన్, ఏటీఎం కార్డులతో పాటు నేపాల్ దేశానికి చెందిన కరెన్సీ ఉండడాన్ని గుర్తించారు. ఽఓటరు కార్డులో మెక్ బహదూర్, తండ్రి ఖదక్ బహదూర్ 2/ఎన్‌ఏ అన్నాసాలై, నాగల్‌కని, క్రోమ్‌పేట, చెన్నై అనే వివరాలు ఉండటం అతను చెన్నైలో స్థిర నివాసం ఉంటున్నట్లు భావిస్తున్నారు. అతని పర్సులో నేపాల్‌కు చెందిన కరెన్సీతో పాటు చెన్నై ఐడీబీఏ బ్యాంక్‌లో రూ.40 వేలు నగదు జమ చేసినట్లు ఓచర్లు ఉండడాన్ని రైల్వేపోలీసులు గుర్తించారు. రాక్సుల్ జంక‌్షన్ నుంచి చెన్నై సెంట్రల్ వరకు రైల్వే టికెటు ఉంది. చెన్నైలోని జనరల్ ఇండస్ట్రీయల్ లెదర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నట్లుగా గుర్తింపు కార్డు ఉంది. వీటి ఆధారంగా వారికి సమాచారం అందించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Advertisement