వృద్ధురాలు ఆత్మహత్య
వృద్ధురాలు ఆత్మహత్య
Published Wed, Nov 9 2016 1:44 AM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM
నాయుడుపేటటౌన్ : స్థానికులు చూస్తుండగానే ఓ వృద్ధురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలోని పొగగొట్టం కాలనీలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. దొరవారిసత్రం మండలం తల్లంపాడు పంచాయతీ ముత్తారాశిపాళెంకు చెందిన చాపల గంగమ్మ (85) పొగగొట్టం కాలనీలో ఉన్న కోడలుకు చెందిన గుడిసెలో కొద్ది రోజులుగా నివాసం ఉంటుంది. రెండు రోజుల క్రితం ముత్తారాశిపాళెంకు వెళ్లి పింఛన్ కూడా తెచ్చుకుంది. ఆమె మానసిక స్థితి సరిగాలేక ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు తెలుస్తోంది. హఠాత్‌పరిణామానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. అప్పటికే వృద్ధురాలు చాలావరకు కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement