వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం
రావూరు (ఇందుకూరుపేట): గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ మాజీ సైనిక ఉద్యోగి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన మండలంలోని రావూరులో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. రావూరుకు చెందిన మహానంది సుబ్బరాయుడు (65) మాజీ సైనికోద్యోగి. ప్రతి రోజు తెల్లవారు జామున మైపాడులోని నెల్లూరు ప్రధాన రహదారిపై వాకింగ్ చేయడం అలవాటు. రోజులాగేనే ఆదివారం తెల్లవారుజామున జగదేవిపేట రోడ్డు వైపు వాకింగ్‌కు బయలు దేరాడు. పున్నూరు అంకమ్మ సత్రం వద్దకు చేరుకునే సరికి గుర్తుతెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన సుబ్బారాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతుడు సుబ్బారాయుడుకు భార్య రమణమ్మ పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఎస్‌ఐ షరీఫ్ తెలిపారు.