ఆటో, మోటర్ బైక్ ఢీ: ఒకరు మృతి | One killed in road accident in vizianagaram district | Sakshi
Sakshi News home page

ఆటో, మోటర్ బైక్ ఢీ: ఒకరు మృతి

Published Wed, Jul 29 2015 1:33 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

One killed in road accident in vizianagaram district

విజయనగరం: విజయనగరం జిల్లా తెర్లాం మండలం నందిగాం వద్ద ఆటో, మోటారుసైకిల్ బుధవారం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడిక్కడే మృతిచెందగా..మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వెంటనే స్పందించి క్షతగాత్రులను బొబ్బిలిలోని ఓ ఆసుపత్రికి తరలించారు.

బొబ్బిలి నుంచి నందిగాం వైపు ఆటో వస్తుండగా... మోటార్ సైకిల్ తెర్లాం నుంచి నందిగాం వైపు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతిచెందిన మహిళను తెర్లాం మండలం ఆవిటి గ్రామానికి చెందిన గుడ్ల పార్వతమ్మ(50)గా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకుని... పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement