![కారు ఢీకొని బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి మృతి - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/41469892856_625x300.jpg.webp?itok=Z0iZts7E)
కారు ఢీకొని బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి మృతి
కుదిరి (సూళ్లూరుపేట) : బైక్‌ను ఎదురుగా కారు ఢీకొనడంతో బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కుదిరి–అటకానితిప్ప మధ్యలో శనివారం జరిగింది. కోవూరుకు చెందిన నలగండ్ల అశోక్ (32) శ్రీహరికోటలో బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగిగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. శనివారం మోటార్‌బైక్‌పై సూళ్లూరుపేటకు కూరగాయలు తీసుకుని తిరిగి వెళ్తుండగా, స్పేస్ సెంట్రల్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేసే గాం«ధీ తన కారులో శ్రీహరికోట నుంచి కేఆర్‌పీ కాలనీకి వస్తూ అతివేగంగా ఎదురెదురుగా అశోక్ బైక్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అశోక్ పులికాట్ సరస్సులోకి ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్న గాంధీకి కూడా స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై జీ గంగాధర్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అశోక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.