bike car collides
-
Nalgonda: ఘోర ప్రమాదం.. నలుగురు మృత్యువాత
సాక్షి, నల్గొండ: నల్గొండ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద కారు అదుపు తప్పి బైక్‌ను ఢీకొట్టింది. అనంతరం కారు కూడా పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు ప్రమాద స్థలంలోనే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను మద్దిమడుగు ప్రసాద్, ఆయన కుమారుడు అవినాష్, కారు డ్రైవర్ మణిపాల్‌గా గుర్తించారు. ప్రసాద్ తన వ్యక్తి భార్య, కుమారుడితో కలిసి హైదారాబాద్ నుంచి చింతపల్లి మండలం అంకపల్లికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. నసర్లపల్లి వద్దకు రాగానే వేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలతో ప్రసాద్, అవినాష్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కారు డ్రైవర్ మణిపాల్ మృతి చెందాడు. ప్రసాద్ భార్య రమణపాటు కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలవ్వగా.. క్షతగాత్రులను దేవరకొండ ఆసుపత్రికి తీసుకెళ్లగా, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు ఆరా తీస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: యాదాద్రి జిల్లాలో విషాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. ఇద్దరు మృతి.. -
పెద్దపల్లి జంక్షన్లో ఘోరం
యలమంచిలి : జాతీయ రహదారిపై పెద్దపల్లి జంక్షన్ వద్ద ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో వృద్ధుడు మృతి చెందగా, ద్విచక్ర వాహనం దగ్ధమైంది. స్థానికులను నిశ్చేష్టులను చేసిన ఈ దుర్ఘటన వివరాలివి. ఆదివారం ఉదయం రామ్‌నగర్‌కు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి రాపేటి అప్పనాయుడు(68) టీవీఎస్ ఎక్సెల్ వాహనంతో పెట్రోల్ బంకులో పెట్రోలు కోసం వెళ్లి తిరిగి ఇంటికి చేరుకునే సమయంలో యలమంచిలి జాతీయ రహదారిపై పెద్దపల్లి జంక్షన్ వద్ద విశాఖపట్నం నుంచి తుని వెళ్తున్న కారు వేగంగా ఢీకొంది. దీంతో ముందు వెళ్తున్న టీవీఎస్ వాహనం నడుపుతున్న రాపేటి అప్పలనాయుడు 10 అడుగుల దూరంలో పైకి ఎగిరి కిందపడి మృతిచెందాడు. అదే సమయంలో కారు ద్విచక్రవాహనాన్ని ఈడ్చుకెళ్లడంతో ద్విచక్రవాహనంలోని పెట్రోలు బయకువచ్చి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో టీవీఎస్ వాహనం కాలిబూడిదైంది. పెద్దపల్లి జంక్షన్లో జరిగిన ఈ సంఘటన కళ్లారా చూసిన స్థానికులు పరుగు పరుగున ప్రమాదానికి గురైన అప్పలనాయుడు వద్దకు చేరుకుని చూడగా అప్పటికే అప్పలనాయుడు ప్రాణాలు విడిచారు. అదే సమయంలో కారు వద్దకు చేరుకుని కారులో ప్రమాణిస్తున్న వారిని బయటకు దింపారు. కారుకు సమీపంలో కాలిపోతున్న ద్విచక్రవాహనాన్ని అతికష్టంపై దూరంగా తరలించారు. కారు నడిపిన వ్యక్తిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. అప్పలనాయుడు మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడు అప్పలనాయుడు రైల్వేలో టెక్నీషియన్‌గా ఉద్యోగం చేసి 10 ఏళ్ల క్రితం పదవీ విరమణ పొందాడు. రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విశ్రాంత ఉద్యోగులకు అనేక సేవలందించినట్టు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి దగ్గరలోనే మృతుడు అప్పలనాయుడు నివాస ప్రాంతం కావడంతో స్థానికులు ప్రమాదస్థలానికి అధికంగా తరలివచ్చారు. సంఘనటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ గొర్లెనారాయణరావు ట్రాఫిక్ క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
కారు ఢీకొని బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి మృతి
కుదిరి (సూళ్లూరుపేట) : బైక్‌ను ఎదురుగా కారు ఢీకొనడంతో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కుదిరి–అటకానితిప్ప మధ్యలో శనివారం జరిగింది. కోవూరుకు చెందిన నలగండ్ల అశోక్ (32) శ్రీహరికోటలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. శనివారం మోటార్‌బైక్‌పై సూళ్లూరుపేటకు కూరగాయలు తీసుకుని తిరిగి వెళ్తుండగా, స్పేస్ సెంట్రల్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసే గాం«ధీ తన కారులో శ్రీహరికోట నుంచి కేఆర్పీ కాలనీకి వస్తూ అతివేగంగా ఎదురెదురుగా అశోక్ బైక్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అశోక్ పులికాట్ సరస్సులోకి ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్న గాంధీకి కూడా స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై జీ గంగాధర్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అశోక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.