రెండు ఆటోలు ఢీ : యువకుడి మృతి | One killed in road accident in ysr district | Sakshi
Sakshi News home page

రెండు ఆటోలు ఢీ : యువకుడి మృతి

Published Sat, Aug 29 2015 4:07 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

One killed in road accident in ysr district

కడప : ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొని ఒక యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా అట్లూరు మండలం ముత్తుకూరు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ముత్తుకూరు గ్రామంలో జరుగుతున్న ఓ శుభకార్యానికి వచ్చి వెళ్తున్న ఆటో అదే కార్యక్రమానికి వస్తున్న మరో ఆటోను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో.. ఆటో ముందు భాగంలో డ్రైవర్ పక్కన కూర్చున్న మహబూబ్‌పాషా (21) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో స్థానికులు వెంటనే స్పందించి అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement