చిత్తూరు : చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం 24 పెద్దూరు గ్రామంలో అతిసార ప్రబలి ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలోని మంచినీటి పథకం నుంచి సరఫరా అయ్యే నీరు సోమవారం కలుషితం కావడంతో స్థానికులు అస్వస్థతకు గురయ్యారు.
దాంతో గత రాత్రి దాదాపు 15 మంది ఆసుపత్రుల్లో చేరారు. మంగళవారం మధ్యాహ్నం కనకమ్మ ( 80) పరిస్థితి విషమించి చనిపోయింది. మరో వ్యక్తి మునెస్ప (55) ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.