
కేవీబీపురం మండలం ఆదరం పంచాయతీ పరిధిలోని గిరిజన, దళిత కాలనీల్లో అతిసారం విజృంభించింది. ఇప్పటికే 27 మంది ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం రాత్రి మరో ముగ్గుర్ని ఆస్పత్రికి తరలించారు. వీరంతా శ్రీకాళహస్తి, తిరుపతిలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో నెలకొన్న పారిశుద్ధ్య లోపం, తాగు నీటి కలుషితం వల్లే అతిసారం ప్రబలినట్టు డాక్టర్లు అనుమానిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ కూడా జరిగి ఉండవచ్చని చెబుతున్నారు. పదుల సంఖ్యలో ఆస్పత్రులపాలవడం స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment