రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కలిగిరి: కలిగిరిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మంగళవారం ఆర్టీసీబస్సు, బైకు ఢీ కొన్న సంఘటనలో ఎస్థానిబాషా (19) అనే యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం మేరక.. కలిగిరికి చెందిన ఎస్థానిబాషా, వీరారెడ్డిపాలెంకు చెందిన స్నేహితుడు మనోజ్ ఇద్దరూ హసనాపురంలో ఐటీఐ కాలేజికి వెళుతున్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గేదెలను తప్పించబోయి ఉదయగిరికి వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న ఎస్తానీబాషా తీవ్రంగా గాయపడగా.. మనోజ్‌కు కూడా గాయాలయ్యాయి. బాషా పరిస్థితి విషమంగా ఉండటంతో అతనిని నెల్లూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. సాయంత్రం చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. బస్సు డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే పోలిస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు నమోదు చేసుకున్నారు.