పాక్లో బాంబు పేలుడు: ఐదుగురికి తీవ్ర గాయాలు | Five injured in blast in Pakistan fruit market | Sakshi
Sakshi News home page

పాక్లో బాంబు పేలుడు: ఐదుగురికి తీవ్ర గాయాలు

Published Tue, Jan 7 2014 2:04 PM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM

Five injured in blast in Pakistan fruit market

పాకిస్థాన్ గిరిజన ప్రాంతంలో పళ్ల మార్కెట్ సమీపంలో ఈ రోజు ఉదయం బాంబు పేలుళ్లు సంభవించింది. ఆ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యారు. క్షతగాత్రులను హుటాహుటిన సద్దాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు.

 

పళ్ల మార్కెట్లోని ఓ పళ్ల దుకాణం పక్కన పేలుడు పదార్థాలతో ఉంచిన బ్యాగ్ పేలుడంతో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. అయితే ఆ పేలుడు ఘటనకు తామే బాధ్యులమని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement