రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు | five injured in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

Published Sun, Jul 12 2015 4:17 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

five injured in road accident

రామాయంపేట (మెదక్): ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొని ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు.. మెదక్ నుంచి అదే డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు రామాయంపేట మీదుగా సిద్ధిపేట వెళ్తోంది.

ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కొమిగండ్ల గ్రామ శివారులోని మలుపు వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో బస్సులోని ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికత్స కోసం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం బస్సులోని ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement