నల్గొండ: ఆత్మకూరు మండలంలోని వేపూరు గ్రామంలో పిచ్చి కుక్క ఒకటి స్క్వైరవిహారం చేసింది. పిచ్చి కుక్క దాడి చేసి ఎరుకల స్వప్న, మొదిళ్ల విశాల్, వర్ధ మేఘన, టి. లక్ష్మమ్మ, బిక్షం అనే వ్యక్తులను గాయపరిచింది. మొదిళ్ల విశాల్, వర్ధ మేఘనల పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పిచ్చి కుక్క కోసం గ్రామస్తులు వేట ప్రారంభించారు. చిన్న పిల్లలను ఏమైనా కరుస్తుందేమోనని గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు.
(ఆత్మకూరు)
పిచ్చికుక్క దాడి..ఐదుగురికి గాయాలు
Published Thu, Feb 12 2015 7:18 PM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM
Advertisement
Advertisement