వంగూరు:మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం కమాల్‌పూర్ స్టేజీ సమీపంలో దేవరకొండ - కల్వకుర్తి ప్రధాన రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని కొత్తూరు మండలం హెచ్‌ఏఎల్ కంపెనీ ఉద్యోగులు కారులో దేవరకొండవైపు వెళుతుండగా కమలాపూర్ స్టేజీ సమీపంలో ఎదురుగా వచ్చిన కల్వకుర్తి ఆర్టీసీ డిపో బస్సు ఢీకొంది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న విరీష్, విద్యాసాగర్, సూడామన్, మనోజ్, నరేష్‌లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మనోజ్, విద్యాసాగర్, సూడామన్‌ల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. కాగా, ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.